భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రేపాక గ్రామానికి చెందిన బోయిని తిరుపతి రాజ్ తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ తో దున్నుతూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలై ఆయన మృతి చెందాడు. ఈ క్రమంలో తిరుపతి మృతదేహం మీద పడి భార్య, కూతురు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. 'నాన్న లే ఒకసారి.. అమ్మ, తమ్ముడు వచ్చాం' అంటూ.. తండ్రి మృతదేహన్ని చూసి కూతురు విలపించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది.