భూపాలపల్లి కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 7వ తేది నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న కుంభాభిషేకం మహోత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో మహోత్సవాల నిర్వహణపై దేవాదాయ, పంచాయతి రాజ్, విద్యుత్, వైద్య, ఇరిగేషన్, పోలీస్, అగ్నిమాపక, ఆర్టీసీ, సమాచార శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.