ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ... ఒకరికి తీవ్ర గాయాలు

70చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాటారంలో గురువారం బైకును లారీ ఢీకొట్టడంతో సబ్ స్టేషన్ పల్లి గ్రామానికి చెందిన తోట రవికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని
108 అంబులెన్స్ లో భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఇసుక లారీలను నియంత్రించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు, గ్రామస్తులు నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్