కాలేశ్వర పూజల్లో పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ

75చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రవచనాలను వినిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్