కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో రెండోదఫా నీటి అధ్యయనం గురువారం ప్రారంభమైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు పూణే కు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో పరిశీలనను పరీక్షలు అధ్యయనం కొనసాగుతుంది. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజీ లో మొదటి దఫా పరీక్షలు 3 రోజుల పాటు కొనసాగాయి. ప్రస్తుతం బ్యారేజీలో నీటి నిలువ తగ్గడంతో రెండో దఫా అధ్యయనం గురువారం ప్రారంభించారు.