గత 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేత మచ్చ సోమయ్య @ సమ్మయ్య కుటుంబాన్ని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే సందర్శించారు. పంబాపూర్ గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు మచ్చ సోమయ్య ఇంటికి వెళ్లి ఆయన భార్య సుగుణమ్మకు దుప్పట్లు, మెడికల్ కిట్, నిత్యవసర వస్తువుల సరుకులను ఎస్పి అందజేసి, అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి జీవనోపాధి, కుటుంబ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.