ముక్కోటి ఏకాదశి సందర్భముగా శుక్రవారం గణపురం మండలంలోని కోటగుళ్లలో ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు రాగా అర్చకులు నాగరాజు ముందుగా గణపతి నందీశ్వరునికి పూజ కార్యక్రమాలతో ప్రారంభించి స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.