విధుల పట్ల నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. బుధవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా, ఆరోగ్య కేంద్ర సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.