రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన జమ్మికుంటలో శుక్రవారం రాత్రి జరిగింది. పట్టణ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లికి చెందిన జోడు కుమార్ (27) జమ్మికుంట నుంచి స్వగ్రామం వెళ్తుండగా కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న రామన్నపల్లికి చెందిన పూరెల్ల మధుకర్ బైక్ ను ఢీకొట్టాడు. దీంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.