నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటులో భాగంగా భూపాలపల్లికి అవకాశం లభించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి రూ. 200 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు.