భూపాలపల్లి జిల్లా జంగేడులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి శనివారం అల్పాహార కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని, అందులో భాగంగానే ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.