భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షర శ్రీకర మహోత్సవం, ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. తరలివచ్చిన భక్తులకు తీర్థ్ర, ప్రసాదాలను అందజేశారు.