సాధరణంగా కొందరు మహిళలు గొడవకు దిగారంటే వారిని విడిపించడం చాలా కష్టం. మధ్యలోకి వెళ్లి విడిపించే ప్రయత్నం చేసిన వారి పని ఖతం అనే చెప్పాలి. జుట్టు పట్టుకుని పోట్టు పోట్టు కొట్టుకున్న ఘటన భూపాలపల్లి కాళేశ్వరం బస్టాండులో సోమవారం చోటు చేసుకుంది. బస్సు కోసం వేచి చూడగా అర్ధగంట తర్వాత ఒకే ఒక్క బస్సు రావడంతో సీటు కోసం ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్రంగా దాడి చేసుకున్నారు. జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.