రోడ్డు మీద పడ్డ చెట్టు కొమ్మ.. అరగంట సేపు రాకపోకలు బంద్

60చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం గాలివాన వచ్చిన విషయం తెలిసిందే. ఈ వానకి రోడ్డుపై మీద పెద్ద చెట్టు కొమ్మ, విద్యుత్ స్తంభం విరిగి పడ్డాయి. దీనితో అరగంట సేపు వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి. గ్రామ ప్రజలు స్పందించి గొడ్డలు తీసుకొని ఆ పెద్ద చెట్టు కొమ్మను నరికారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అలాగే విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్