మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామంలో గురువారం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తుల నుండి 50 లీటర్ల నాటు సారా, 250 లీటర్ల పానకం ధ్వంసం చేసి ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.