డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని ఆకేరు వాగు వద్ద శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. నడుచుకుంటూ వస్తుండగా.. బురదలో బోర్లా పడి మృతి చెందాడని వారు అన్నారు. పాయింట్ జేబులో మందు బాటిల్, చేతిలో స్టఫ్ ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.