సీరోల్ మండలం మన్నెగూడెం గ్రామంలోని శ్రీ పార్వతి రామలింగేశ్వర శివాలయంలో శుక్రవారం అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గురుస్వామి నాగేశ్వరరావు అయ్యప్ప స్వాములకు ఇరుముడ్లను కట్టారు. దీనితో ఆలయం స్వాములతో కిటకిటలాడి పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాముల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం శబరిమలైకి బయలుదేరనున్నట్లు స్వాములు తెలిపారు.