ముల్కలపల్లిలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం

69చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో సోమవారం బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన పిల్లలను, 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలను బడిలో చేర్పించాలని వారు గ్రామంలో పర్యటిస్తూ. పాంప్లెట్లను పంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్