కూలిన గుడి.. గంగమ్మ తల్లి, పోతురాజు విగ్రహాల వెలికి తీత

82చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఇటీవల ఆకేరు వాగులో వచ్చిన భారీ వరదకు గంగమ్మ గుడి కూలి కూలింది. బ్రిడ్జి-గంగమ్మ గుడికి వెళ్లడానికి ఉండే మెట్లు, గేట్లు 100 మీటర్ల వరకు కొట్టుకుపోయాయి. యాదవ సంఘం సభ్యులు కలిసి ఆదివారం గంగమ్మ తల్లిని, పోతురాజు విగ్రహాలను బయటకు తీశారు. ఆ విగ్రహాలను నీటితో కడిగి, కొబ్బరికాయలను కొట్టి, యాటలను కోశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్