వరద బాధితుల ఇండ్లను సందర్శించిన కలెక్టర్

63చూసినవారు
డోర్నకల్ మండలంలోని దుబ్బ తండా, మోదుగడ్డ తండా, ముల్కలపల్లి మొదలైన గ్రామాలలో ఇటీవల వచ్చిన వరదకు మునిగిన వరద బాధితుల ఇండ్లను, వ్యవసాయ భూములను బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించారు. వారు మాట్లాడుతూ. గ్రామాలలో పక్కాగా శానిటేషన్ నిర్వహించి, అంటు వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా చూడాలని సంభందిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.