డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం కొన్ని ఇండ్లలోకి భారీ వరద చేరింది. దీనితో గ్రామ ప్రజలకు తినడానికి తిండి లేదు. మంగళవారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటాచారి స్పందించి తన స్వంత ఖర్చుతో వరద భాదితులకు బియ్యాన్ని, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు జగదీష్, ప్రత్యేక అధికారి రుక్మాంగధర రావు, మాజీ వార్డు మెంబర్స్, యువత, తదితరులు పాల్గొన్నారు.