డోర్నకల్: దళిత వ్యక్తిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

7చూసినవారు
దళిత వ్యక్తిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకుడు విజయకాంత్ అన్నారు. మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడెళ్లగూడెంలో శుక్రవారం మొహర్రం వేడుకల సందర్భంగా డప్పు కొడుతున్న ఎస్సీ కులస్థులపై అదే గ్రామానికి చెందిన కొందరు బీసీ ముదిరాజ్ కులస్థుల యువకులు దాడి చేశారు. ఎస్సీ కులస్థుడిపై దాడి చేసి గాయపరచడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్