
అలర్ట్.. 6,491కి చేరిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6,491కు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. అత్యధికంగా కేరళలో 1,957, మహారాష్ట్రలో 607, ఢిల్లీలో 728, గుజరాత్లో 980, కర్ణాటకలో 423, ప.బెంగాల్లో 747, తమిళనాడులో 219, తెలంగాణలో 9, ఏపీలో 85 కరోనా కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 65 మంది మృతి చెందారు.