మహబుబాబాద్ జిల్లా డోర్నకల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని తోడెళ్లగూడెం, వెన్నారం, పెరుమాండ్ల సంకీస, చిలుకోడు, గొల్లచెర్ల, డోర్నకల్, రాజు తండా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఉక్కపోత తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు కాస్తా ఉపశమనం పొందారు.