విద్యుత్ షాక్ తో విద్యుత్ శాఖ ఉద్యోగి మరణించిన సంఘటన శనివారం డోర్నకల్ మండలంలో చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలానికి చెందిన క్రాంతికుమార్ డోర్నకల్ మండలంలో లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ కేబుల్ తగిలి మృతి చెందాడు. క్రాంతికుమార్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.