మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల వ్యాప్తంగా ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల కల్లాలలోకి తీసుకు వచ్చి ఆరబెట్టిన మొక్కజొన్న తడిసి పోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. చేతుకందిన పంట అమ్ముకుందామని తెస్తే తేమ పేరిట అధికారులు కాలయాపన చేయడంతో అకాల వర్షాల వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.