డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బానోత్ ఉమ (20) అదే గ్రామానికి చెందిన ఆలకుంట్ల చంటిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య గొడవ ఏర్పడి ఎలుకల మందు తిన్నారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా గురువారం ఉమ మృతి చెందారు. కాగా ఉమ గర్భంతో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.