మెగా లోక్ అదాలత్‌ని సద్వినియోగం చేసుకోవాలని కురవి ఎస్సై సతీశ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు తెలిపారు. గొడవలు వద్దు-రాజీలు ముద్దు అని, వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయని వారు తెలిపారు. ఈ లోక్ అదాలత్ డిసెంబర్ 2 నుంచి 14 వరకు ఉంటుందని వారు తెలిపారు. మీపై, మీకు తెలిసిన వారిపై కేసులు ఉన్నట్లయితే రాజీపడి కోర్ట్‌కి హాజరైతే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయబడును అని వారు తెలిపారు.