డోర్నకల్ మండలం రావిగూడెం, ముల్కలపల్లి గ్రామాలలో వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నారని శనివారం రాత్రి స్థానిక ప్రజలు అంటున్నారు. కొత్త సంవత్సరం ముందురోజు రాత్రి విద్యుత్ దీపాలు లేక టార్చ్ లైట్లు వేసి, ముగ్గులు వేసుకున్నామని వారు చెబుతున్నారు. లైట్స్ లేక చీకట్లో పాములు తిరుగుతున్నాయని, అవి కరిచే అవకాశం ఉందని తెలిపారు. ఈ సంక్రాంతికి అయినా స్ట్రీట్ లైట్లను వెలిగిస్తారా లేదా చూడాలి అని వారు ప్రశ్నిస్తున్నారు.