డోర్నకల్ మండలం బూర్గుపాడు అంగన్వాడీ కేంద్రానికి వసతులను కల్పించాలని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దబ్బా శ్రీను వినతిపత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రాలను డోర్నకల్ ఎంపీడీవో శ్రీనివాస రావు, తహశీల్దార్ కృష్ణవేణికి, సీడీపీఓ లక్ష్మికి అందజేశారు. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ, గేటు, మంచినీటి వసతి, కరెంట్, మరుగుదొడ్డి మొదలైనవి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.