డోర్నకల్ మండలం ముల్కలపల్లి ఎంపీపీస్, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో శుక్రవారం ముందుగా సంక్రాంతి పండుగ వేడుకలను నిర్వహించారు. బోగి మంటలను వేసి, బోగి పాటలను పెట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు మంట చుట్టూ తిరిగారు. విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.