ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్బంగా డోర్నకల్ మండలం వెన్నారం, ముల్కలపల్లి సీతారామ చంద్ర స్వామి ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ఏకాదశి సందర్బంగా విగ్రహాలను పూలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దీనితో ఆలయాలు భక్తులతో కిటకిటలాడి సందడి వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు సతీష్, సాయి ప్రియతం, మాజీ సర్పంచ్ రాంప్రసాద్, గ్రామ ప్రజలు పూజల్లో పాల్గొన్నారు.