డోర్నకల్ మండలం రాముతండా చెరువులో గ్రామానికి చెందిన రైతు బానోత్ హనుమంత్ వలకి శనివారం వింత చేప చిక్కింది. ఆ చేప అర కేజీ బరువు ఉందని, సముద్రపు చేప అని ఆ రైతు తెలిపాడు. ఇంటి పక్కన ఉన్న వారు చూసి ఆ చేప వింతగా ఉందని వారు అనుకుంటున్నారు. చేప ముఖం మనిషిలా ఉందని, మనిషిలానే ముక్కు, చెవ్వులు ఉన్నాయని వారు తెలిపారు.