డోర్నకల్ పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇస్రో స్పేస్ విహారయాత్రకు వెళ్లారు. కేరళ, తమిళనాడు, త్రివేండ్రం, ఇస్రో స్పేస్ సెంటర్ ఇతర ముఖ్యమైన ప్రదేశాలను వీక్షించుటకు పాఠశాల యాజమాన్యం 8, 9 తరగతులకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులను తీసుకువెళ్లింది. ఆహ్లాదంతో పాటు విజ్ఞానం పెంపొందించుకొనుటకు ఈ విహారయాత్ర దోహదపడుతుందని పాఠశాల యాజమాన్యం తెలిపారు.