డోర్నకల్: 25 ఏళ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు

72చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్ పీహెచ్ఎస్ లో 1999-2000 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేశారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించి, మెమెంటోలను అందజేశారు. మృతి చెందిన నలుగురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థుల పట్ల నిమిషం పాటు మౌనాన్ని పాటించారు. పాఠశాలలో వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నెమరు వేసుకున్నారు.

సంబంధిత పోస్ట్