డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కశ్నబోయిన ధర్మరాజు (37) అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల నుంచి జ్వరం రాగా ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వారు తెలిపారు. అతని మృతి పట్ల పలువురు డ్రైవర్లు సానుబూతిని, సంతాపం వ్యక్తం చేశారు.