డోర్నకల్ మండలం ముల్కలపల్లి ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జి కూలిన విషయం తెలిసిందే. అధికారులు పాత బ్రిడ్జికి మరమ్మతులు చేసి మహబూబాబాద్-ఖమ్మం వెళ్లడానికి రోడ్డుని కలిపారని స్థానికులు తెలిపారు. పాత బ్రిడ్జి మీద నుంచి వెళ్లడానికి భారీ వాహనాలకు ప్రవేశం లేదు అనే ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీని నామరూపం లేకుండా చేసి, ఫ్లెక్సీకి సపోర్ట్‌గా ఉంచిన ఫ్రేమ్‌ను, కర్రను విరగొట్టారని వారు తెలిపారు.