మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామ శివారులో గ్రీన్ ఫీల్డ్ హైవే లో పనిచేస్తున్న మహిళ శనివారం బావిలో పడి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు గమనించి బావిలో నుండి మహిళ మృతదేహం ఒడ్డుకు చేర్చారు.
సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.