మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం టంకు తండాలో గురువారం సైబర్ నేరగాళ్ల వలలో పడడంతో భూక్యా సరిత తన అకౌంట్ నుండి 86 వేల రూపాయలు పోగొట్టుకుంది. వెంటనే అప్రమత్తమైన మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల అకౌంట్ ఫ్రీజ్ చేసి 50 వేలు హోల్డ్ లో పెట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు.