తడిసిన ఇండ్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

57చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ఇండ్లు నీళ్లలో మునిగి తడిశాయి. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ గురువారం అక్కడికి చేరుకొని వరద బాధితులను, కూలిన బ్రిడ్జిని, కొట్టుకుపోయిన రోడ్డుని, కొట్టుకుపోయిన పంటలను పరిశీలించారు. ప్రజలు, రైతులు నష్ట పోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వారు తెలిపారు. ప్రతీ గ్రామానికి ఒక టీంని ఏర్పాటు చేయాలనీ వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్