
జ్వరంతో పదో తరగతి విద్యార్థిని మృతి
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలం చెల్పూర్ నివాసి బండారి రమ్య బుధవారం జ్వరంతో బాధపడుతూ మరణించింది. రమ్య గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే, ఆమెకు వారం క్రితం జ్వరం రావడంతో హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో, జ్వరం తీవ్రమవడంతో ఆమె మంగళవారం మరణించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.