కురవి: డిప్యూటీ స్పీకర్ పదవి రావడం పట్ల కార్యకర్తల సంబరాలు

79చూసినవారు
మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్ ను డిప్యూటీ స్పీకర్ గా నియామకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం కురవి మండలకేంద్రంలో గుడిసెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కోసం కష్ట పడిన నాయకుడికి సరైన గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్