మహబుబాబాద్ జిల్లా కురవి మండల పరిధి మోదుగుల గూడెంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాసమల్ల యాదగిరి, సాలమ్మ దంపతుల ఇంటి పైకప్పు కూలింది. దీంతో దంపతులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటి పెంకులు సాలమ్మ మీద పడటంతో వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.