మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని శ్రీవీరభద్రస్వామి వారి ఆలయంలో గురువారం బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా రాకేష్ రెడ్డికి కురవి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పలువురు పాల్గొన్నారు.