కురవి మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి తండ్రి ఈర్యానాయక్ ఇటీవల మరణించారు. కురవి మండలంలోని నేరడ శివారు తండాలో బుధవారం రాత్రి ఈర్యానాయక్ చిత్రపటానికి టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రవి మండలానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మలిశెట్టి వేణు తదితరులున్నారు.