కురవిలో సీపీఐ జిల్లా మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును శనివారం టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్ కలిసారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ లు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, పరిష్కారం కోసం ప్రయత్నించాలని కూనంనేని కోరారు. సానుకూలంగా స్పందించిన సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడుతానని హామీ ఇచ్చారు.