బాలకర్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు పాటు పడాలని శుక్రవారం జిల్లా ఎస్పీ సుధీర్ రాం నాధ్ కేకన్ అన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టి చాకిరీ చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కి సమాచారం అందించాలని వారు తెలిపారు. ఆపరేషన్-XIలో భాగంగా ఆపరేషన్ స్మైల్ పోస్టర్ ఆవిష్కరించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.