ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతి నెలా చెల్లించే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మరిపెడ సాంఘికసంక్షేమగురుకుల పాఠశాలలో విద్యార్థుల సంబరాలలో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.