![మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్](https://media.getlokalapp.com/cache/26/3e/263e64edcad663456cad26c149a1e6e5.webp)
మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్
ఏపీలోని కృష్ణా జిల్లాలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పవన్ అన్నారు. ఈ వాహనం కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలందించనుంది