మరిపెడ: రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

54చూసినవారు
మరిపెడ: రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండలం గిరిపురం, ఎల్లంపేట యలమంచిలి తండాలో భూ భారతి చట్టంపై గురువారం రైతు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఎల్లంపేట రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ కృష్ణవేణి హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా రైతు రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆస్ఐ శరత్ చంద్ర, సిబ్బంది, తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్